Pages

Tuesday, June 1, 2010

జైలుపక్షి

ప్రపంచం మారిపోయింది. ఔను ప్రపంచం మారిపోయింది.అప్పటికి ఇప్పటికి ఎంత తేడా. ఒకప్పుడు ఎప్పుడో కాని ఎర్ర

బస్సు కనిపించేది కాదు మా ఊర్లో రోడ్లపైన. చిన్నప్పుడు ఎవరైన అంబాసిడర్ కార్లో మా ఊరి ఎర్రమట్టి రోడ్లపైన

దుమ్ములేపుకుంటు వెళ్తుంటే  వింతగా చుసేవాల్లం. ఇప్పుడో ఎర్రమట్టి రోడ్ల స్థానే నల్లగా అద్దం లా మెరిసే పేద్ద రోడ్లు

కనిపిస్తున్నయ్. రోడ్ల మధ్య పూల చెట్లు రంగురంగుల మెరిసే లైట్లు అబ్బో అవన్ని చూస్తుంటే చిన్నప్పుడెప్పుడో

చదువుకొన్న "అశోకుడు రోడ్ల కిరువైపున చెట్లు నాటించెను" గుర్తుకొస్తుంది.కార్లు మోటార్ సైకిల్లు ఒకటేమిటి అన్ని

రయ్  రయ్ మని దూసుకు వెళ్తున్నాయ్. వాటి వేగానికి అంతు లేదు వాటి సంఖ్య కు అంచనా లేదు. ప్రతి ఒక్కరు

విశ్రాంతి లేకుండా పయనిస్తున్నారు.

                                   "ఏమయ్యా ముసలాయనా చావడానికి నా కారే దొరికిందా, అసలే  కొత్త కారు పైగా ఫారిన్

 నుండి తెప్పిచ్చా, యూ కంట్రిబ్యూట్" అని ఎవరో పిల్లగాడు అరుస్తుంటే ఒక్కసారిగా ఆలోచనలనుండి బయటకు

 వచ్చా. అతను 'ముసలాయనా' అని సంభోదించింది నన్నేనన్న విషయం అర్థమవ్వంగానే, నేను నిజంగానే

ముసలివడినైనానన్న విషయం గుర్తుకు వచ్చింది. ఔను చాల సంవత్సారాలైంది. సరిగ్గా ఈ కుర్రవాడి వయస్సులో

 ఉన్నప్పుడు ఆవేశంలో తప్పు చేసి జైలుకి వెల్లాను. ముప్పై సంవత్సరాల క్రితం ఆ కుర్రవాడికి తప్పు చేస్తే ఏం

జరుగుతుందో తెలియదు. జైలు లోపలికి వెళ్తే ఏది మన దగ్గర నుండి వెళ్ళిపోతుందో అసలే తెలియదు. కాలం ముప్పై

 సంవత్సరాలు వెనక్కి వెళితే నేను ఆ కుర్రవాడితో  మాట్లాడుదామనుకుంటున్నాను. వాడికి జీవితం ఎంత విలువైందో

చెప్తాను. కానీ కాలం వెనక్కు వెళ్ళదు కదా.

                                           దాదాపు ముప్పై సంవత్సరాలు నేను ఆ జైలు గోడల మధ్యే గడిపాను. ఆ గోడలలో ఏదో

ఉంది. ముందు వాటిని చూసి బాధ పడతాం తరువాత అలువాటుపడతాం ఆ తరువాత వాటి బయటకు రావాలంటే

బయపడతాం. జైల్లో ఉన్నంతకాలం నేనొక ముఖ్య వ్యక్తిని . అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి కాస్తో కూస్తో

చదువుకున్నవాడిని. ఎవరైనా ఉత్తరాలు రాయాలనుకున్నా చదవాలనుకున్న నేను కావాలి. నేను పేపర్లో వార్తలు

చదవందే చాలామందికి ఉదయం గడవదు. కాని ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. ఈ ప్రపంచానికి నాలాంటి వాళ్ళ

అవసరం లేదు. జైలునుండి బయటకు వచ్చిన వాళ్ళను ఈ ప్రపంచమేమి పూలమాలలు వేసి స్వాగతించదు.

ఈసడించుకుంటుంది అనుమానిస్తుంది అవమానిస్తుంది. ఇక్కడ నాకెవ్వరు స్నేహితులు లేరు. నన్ను బయటికి

పంపించిన తరువాత అధికారులు నాకొక ఉద్యోగం చూపెట్టారు. ఒక పేద్ద మార్కెట్లో గుమస్తాగా. దీన్ని వీళ్ళు హైపర్-

మాల్ అని పిలుస్తారు.ఇక్కడకు వచ్చే వాళ్ళ కార్లు నిలుపుకోవడానికి రెండు అంతస్థులు కేటాయించారంటే ఇది ఎంత

పెద్దదో అర్థం చెసుకోవచ్చు. ఇక్కడి సూపర్-వైసర్ కి నేను నచ్చలేదు ఇక్కడికి వచ్చేవాళ్ళకు నేను నచ్చలేదు.

ఇక్కడే గేటు దగ్గర ఒకడు నిల్చుంటాడు. వచ్చేపొయే వాళ్ళని పలకరించడానికి. వాడు మూడు అడుగుల ఎత్తు

ఉంటాడు. చిన్నపిల్లలకు వాడిని కొట్టడం సరదా పెద్ద వాళ్ళకు వాడితో ఫోటోలు దిగడం సరదా. తనను

చూసినప్పుడల్లా నాకు నవ్వలో ఏడ్వాలో అర్థమవ్వదు.

                                          ప్రతి రోజు అక్కడ నా పని అయిపోయిన తరువాత పక్కనే ఉన్న పార్క్లోకి వచ్చి

కూర్చుంటాను. చాలామంది అక్కడకు వస్తారు సాయంకాలం నడకకు. అందులొ పిల్లలు ఉంటారు యువకులు

ఉంటారు ముసలివాళ్ళు ఉంటారు.కొంతమంది సరదాగా కబుర్లు చెప్పుకోడానికి వస్తారు కొంతమంది వ్యాయామం

కోసం వస్తారు పిల్లలు ఆడుకోవడానికి వస్తారు. కాని వాళ్ళెవ్వరూ నన్ను పలకరించరు. నేను పలకరించినా నాతో

మాట్లాడే తీరిక వాళ్ళకు లేదు.  అయినా కూడా నేను అక్కడికి వెల్లేవాడినంటే అక్కడ కొన్ని పక్షులున్నయ్. వాటికి

నేను రోజూ గింజలు వేస్తాను బహుశా అలువాటు పడ్డాయేమో నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి.ఎప్పుడైనా ఒక

రోజు నా రాముడు కనిపిస్తాడేమోనన్న ఆశ. రాముడు నేను జైల్లో పెంచుకున్న కాకి పేరు. కాకికి రాముడు పేరు

పెట్టుకుంటావా అనే మతోన్మాదులు ఇంకా ఉన్నారు ఈలోకంలో తరాలు మారినా ఇవి మాత్రం ఇంకా సజీవంగా నే

ఉన్నాయి.జైలునుండి బయటకు వచ్చినప్పుడు తనను అక్కడే వదిలేసివచ్చాను ఇక్కడ తనను ఉంచుకోలేమోనని,

తనను తెచ్చుకొని ఉండాల్సింది కనీసం తనన్న నాకు తోడుగా ఉండేవాడు.బహుశా రాముడు ఈసరికి కొత్తవారితో

స్నేహం చేసుకొని ఉంటాడేమో.                  



                                                  రాత్రిళ్ళు నాకు సరిగా నిద్ర పట్టేది కాదు ఎవో పీడకలలు నన్ను వెంబడించేవి.

నేను ఎక్కడినుండో కిందకు పడిపోతున్నట్టు పాతాళంలో ఉన్నట్టూ ఏవేవో కలలు. ఉన్నట్టుండి ఉళిక్కిపడి

లేచేవాడిని. అప్పుడు నేను ఎక్కడున్ననో తెలియడానికి నాకు చాలా సమయం పట్టేది. ఇక ఈ ప్రపంచంలో నేను

ఉండలేను. నాలాంటి వళ్ళు చనిపోయినా ఇక్కడ ఎవ్వరికీ తెలీదు.అసలు నేను కనిపించకపొయినా పోలీసులు

నాకోసం వెతికి సమ్యం వ్రుథా చేసుకోరు.

  బహుసా ఇదే నేను రాసే చివరి ఉత్తరం కావచ్చు. అనుకుంటా నేను జైల్లో చనిపోయినా బాగుండేదేమో కనీసం

మీరంతా ఉండేవళ్ళు. నేను ఎవరినైనా బాధపెట్టిఉంటే క్షమించండి.


ఇట్లు,
మీ స్నేహితుడు,
R.No: 32065            

Tuesday, May 11, 2010

వ్రుత్తం

ఒకడు ఇంకొకడిని అడిగాడట.

నువ్వెంత గొప్ప చిత్రకారుడువో నాకు చూపించు అని.

ఆ ఇంకొకడు ఒక క్షణం ఆలోచించి సొరుగు లోనుండి కాగితం తీసి

ఏదొ గీసాడు.

మరి కొన్ని క్షణాలు గడచిన తర్వాత ఆ కాగితాన్ని ఆ ఒకడికి అందించాడు.

ఆ కాగితం లోని చిత్రాన్ని చూసిన తర్వాత ఆ ఒకడు ఈ ఇంకొకడి నైపుణ్యాని కి

ఆశ్చర్యపోయాడు. అతని గొప్పతనానికి తల వంచాడు.


ఇంతకీ అంతగా ఆశ్చర్యపరచిన ఆ ఇంకొకడు గీసినదేమితొ తెలుసా ఒక వ్రుత్తం.

ఔను ఒక వ్రుత్తం. ఎ పర్ఫెక్ట్ సర్కిల్,

* * *


ఈసారి ఆ ఒకడు మరొకడిని అడిగాడట.

నువ్వు గొప్ప చిత్రకారుడివైతే నీ చేతులతొ మరేం ఉపయొగించకుండా

ఖచిత్తమైన వ్రుత్తం గీయమని.

ఆ మరొకడు ఒక క్షణం ఆలోచించి కాగితం తీసుకొని మరొక క్షణం లొ ఏదొ గీసి

ఆ ఒకడి చేతికిచ్చాడు. ఈసారి కూడ ఆ ఒకడికి ఆశ్చర్యపోక తప్పింది కాదు.

ఇంతకీ ఆ మరొకడు గీసింది ఏమిటొ తెలుసా!!

తను ఆ కాగితం మేద ఒక చుక్క పెట్టి ఇచ్చాడు.


* * * *

ఈ రెండు సార్లూ ఆ చిత్రకారులు గీసినది వ్రుత్తమే

కాని ఒకడు తన నైపుణ్యాన్ని ఉపయోగిస్తే మరొకడు

తెలివిని ఉపయోగించాడు.

If you have the skill and you are intelligent enough you can surprise the world.

కట్ చేస్తె ....!

మేఘాలలో ఊసులాడుకుంటున్న ఒక జంట.

అందమైన అమ్మాయి చక్కనైన అబ్బాయి.

చుట్టూ ఏకాంతం. ఆ ఏకాంతాన్ని ఇంటెన్సిఫై చేస్తున్న పొగ మంచు.

ఎత్తైన కొండల నడుమ ఇంకా ఎత్తైన కొండ అంచున ఒక చిన్న తాటాకు గుడిసెలొ

ఇంకా చిన్న కొండ బండ రాయి మేద కూర్చొని ఉన్నారు.

పక్కనే ఉన్న ప్లాస్క్లొ నుంచి కప్పుల్లో కి టీ పోసి ఒక కప్పుని ఆ అబ్బాయి కి

అందిస్తుంది ఆ యువతి. ఆ కప్పు ని అందుకునే నెపంతొ తన అందమైన ముని చెతి

వేళ్ళను తాకుతూ ఆ స్పర్శ ను ఇంకొక సారి అనుభవిస్తున్నాడు ఆ యువకుడు.

వారి కళ్ళల్లొని ప్రేమ సంతోషం కొరిక అన్ని చూపులుగా మారి ఒకరినొకరిని

తాకుతున్నాయి .అంతలోకి టీ కాస్త చల్లారిపోయింది వారు వేడెక్కుతున్నప్పటికిన్నూ.

ఇద్దరూ ఒక్కసారి నవ్వేసుకొని మరొక్కసారి ప్లాస్క్లొ నుంచి టీ పోసుకుంటున్నారు.

వారిద్దరి మధ్య ఎటువంటి మాటలూ లేవు కాకపోతే యిద్దరి కళ్ళు విడివడడం

లేదు. ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చొని పరస్పర స్పర్శ లోని ఆనందాన్ని

ఆచ్చాదనను అనుభవిస్తున్నారు. ఇద్దరూ సెకండ్ లొ అరవయ్యొ వంతు కూడా

వ్రుధా చేయకుండ ఒకరి అందాన్ని మరొకరు ఆస్వాదిస్తున్నారు. వారి

పెదవులలో సంత్రుప్తితో కూడిన చిరునవ్వు మొహం లొ ప్రపంచాన్ని జయించ గలిగిన

ప్రశాంతత కళ్ళలొ మన్మధుడిని సైతం మసి చెయ్యగల కోరిక స్పష్టంగా

కనిపిస్తున్నయ్.

అప్పటిదాకా ప్రేక్షక పాత్ర వహించిన మేఘాలు జరగబోయే సంఘటనలను

తలచుకొని సిగ్గుపడ్డాయి కాబోలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తున్నాయ్.

ఒక వైపు ఎత్తుగా పెరిగిన పనస చెట్ట్లు మరొక వైపు గుబురుగా పెరిగిన పూల

చెట్ట్లు కొండ వాలున వరుసగ పెరిగిన తేయాకు మట్ట్లు మంచు కి తడిసి ముద్దయి వాటి

కొమ్మలు ఆకుల అంచుల నుండి కారుతున్న నీటి బిందువులంత స్వచ్చంగా ఉన్నాయి.

పనస చెట్టు మేద తేన తుట్టె లొంచి మధురమైన వాసన పనసను తమతొ కలుపుకొని

మరింత మధురంగా మారి పక్కనే ఉన్న పూల పుప్పొడిని తమపై కప్పుకుంటూ

గాలి మేద సవారి చేస్తు అక్కడే ఉన్న ఆ జంటని చూసి తమ దారి మరిచిపోయి

అలాగే ఆగిపొయ్యాయి కాబొలునేమో ఆ ప్రదేశం సువాసనలతో నిండి పోయింది.

దూరంగా ఎక్కడ్నించో పక్షులు వాటి గూళ్ళకు చేరుకుంటున్న అలజడి వినిపిస్తుంది బహుశా

అది సాయంత్రమేమో. వాటి లొ కొన్ని తమ వారిని చూసిన ఆనందంలో పాడటం మొదలు పెట్టాయి.

ఎప్పుడు జరిగిందో ఏమో వారి చేతులు పెనవేసుకున్నాయి.

ఆ యువకుని కుడి చెయ్యి నెమ్మదిగా ఆ యువతి వామ హస్తం లో నుంచి విడివడి

ఆమె అందమైన పొడగాటి కురులను తడుముతూ మరొక చెతితో మల్లె తీగ లాంటి

ఆమె నడుము పై వేసి మరింత దగ్గరగా లాక్కుంటున్నాడు.

ఆ యువతి తన ఎడమ చేతి తొ అతని ఉంగరాల జుత్తు తొ ఆడుకుంటూ కుడి చేతి తొ

అతని బుగ్గలను నిమురుతుంది. వారిద్దరినీ చూసి కోరికతొ బరెవెక్కాయేమో అన్నట్టు

పక్కనే ఉన్న జాజి మల్లెలు తీగల నుండి విడివడి కిందకి రాలుతున్నాయి.

వాళ్ళిద్దరి కళ్ళూ ఏదో సైగ చెసుకొన్నట్టు ఆ క్షణాన్ని మరి మరిచిపొకుదన్నట్టూ ఆ

ఙాపకాలను బధ్రంగా దాచుకొవడానికన్నట్టూ ఒకే సారి మూసుకున్నాయి.

వారిద్దరి పెదవులూ మరొకరి పెదవులను బంధించాయి. వారు ఆ ప్రేమామ్రుతాలను

స్వీకరిస్తూ ఆ క్షణం లో దేవతలకు సైతం అసూయ ను పెంచారు.


కట్ చేస్తె ....!